Monday, July 2, 2012

మధురానుబంధం

నీతో పంచుకున్న చిన్ననాటి స్మృతులు ,
నీలో దాచుకున్న అనుభూతుల పరిమళాలు ,
శాశ్వతమని మురిసిన నా మనసు ....
నీవు లేవనే నిజాన్ని నమ్మనంటుంది....
ఈ అనుబంధాన్ని వీడనంటుంది....
నీవు మరు జన్మకైనా చూపించగలవా ఆనాటి చిత్రాలని అని నిలదీస్తుంది.........
ఇంతటి ఆనందానికి కూడా తాగనా అని ఆక్రోసిస్తుంది .......
నిన్ను కోల్పోయిన ఆవేదనతో అజాగ్రత్తను క్షమించనంటుంది .........

Wednesday, May 30, 2012

అమ్మ

అమ్మ హృదయంలో బొమ్మలా ఒదిగినవేళ,
                  జీవితమే సప్తసాగర సంగమం .
అమ్మ ఆదరించి ఒడికి రమ్మన్ళవేళ,
                   జీవితమే ఒక అద్భుత కావ్యం .
అమ్మ అలిగి పొమ్మన్నవేళ ,
                    లోకమే అంధకారబందురం .